అతిగా ఆలోచిస్తున్నారా.. జాగ్రత్త ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ!

ప్రస్తుతం ఉన్న బిజీ బిజీ జీవితంలో చాలా మంది పనిభారం వల్ల ఆఫీసు ఒత్తిడి, ఇంట్లో టెన్షన్స్‌తో చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చూస్తూ అతిగా ఆలోచిస్తుంటారు.
ఆ సమస్యలు పరిష్కారం అయ్యేదాక ఎదో ఇక దాని గురించే ఆలోచిస్తుంటారు. అలా చేయడం వల్ల ప్రమాదకరమైన రోగాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
నిత్యం అతిగా ఆలోచిస్తే మనశ్శాంతిని కోల్పోవడంతో పాటు రక్తపోటు సమస్యలను తీవ్రతరం చేస్తోంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి పలు అనారోగ్యాలకు దారి తీస్తుంది.
అతిగా ఆలోచిస్తూ ఉండటం వల్ల కొంత మంది తిండి నిద్ర మానేస్తుంటారు. దీంతో రాత్రిళ్లు నిద్ర పట్టక ఆలోచనలతో మేలుకోనే ఉండాల్సి వస్తుంది. దీంతో అలసట, తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆకలిని అణచివేస్తుంది. దీంతో మెదడుపై ప్రభావం పడి మానసిక వ్యాధులు, ఆందోళన, ఒత్తిడి వంటివి వస్తాయి.
అలాగే ఒత్తిడి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కడుపులో రక్త ప్రసరణ, ఆక్సిజన్‌ను తగ్గించి ప్రమాదంలో పడేస్తుంది.
ఒత్తిడికి గురైతే, శరీరంలో కార్టిసోల్ హార్మోన్ విడుదల అయి రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీని వల్ల అలెర్జీలు, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
అతిగా ఆలోచించడం వల్ల ఈ ప్రభావం నరాలపై పడి అనారోగ్యానికి గురి అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కోసారి పక్షవాతం కూడా రావచ్చు.
ఒత్తిడితో ధమని లో వాపు సంభవించి గుండెకు హాని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించకపోవడం మంచిది.
ఒత్తిడి నుంచి బయటపడేందుకు వ్యాయామం, లేదా ఏదైనా పనిలో బిజీగా ఉండటం వంటివి చేస్తుండాలి.