వర్షాకాలం చన్నీటితో స్నానం చేస్తున్నారా.. అయితే ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే?

పలు చోట్ల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది చల్ల నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదని వర్షాకాలం కూడా అలాగే చేస్తుంటారు.
కానీ, అలా చేయడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వచ్చి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సైనస్ ఉన్నవారు చల్ల నీటితో స్నానం చేస్తే ఆ సమస్య మరింత తీవ్రం అయి ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
అలాగే చన్నీటితో స్నానం చేస్తే హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదానికి దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చల్ల నీరు శరీరంపై పోసుకోవడం వల్ల బిగుసుకుపోయి రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.
వర్షాకాలం వాతావరణం చల్లగా ఉంటుంది. ఆ క్రమంలో చాలా మందికి చన్నీటితో స్నానం చేయడం వల్ల జ్వరం వస్తుంది.
రోగనిరోధక శక్తి తగ్గి సీజనల్ వ్యాధుల బారిన పడుతారు. అలాగే ఒళ్లు నొప్పులు కూడా వస్తాయి.
తిమ్మిర్లు, అస్పష్టమైన దృష్టి తలనొప్పి వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది.
మెదడులో రక్తస్రావం, మూర్చపోవడం వంటివి తలెత్తుతాయి. కాబట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.