అధిక చెవి నొప్పితో బాధపడుతున్నారా.. తగ్గించేందుకు ఇలా ప్రయత్నించి చూడండి..

చెవి నొప్పి అనేది చాలా తీవ్రమైన బాధను కలిగిస్తుంది. అదే వర్షాకాలం, చలికాలం ఆ నొప్పి మరింత ఎక్కువగా ఉంటుంది.
చెవిలో నొప్పి వచ్చేందుకు ముఖ్యంగా.. ఇన్ఫెక్షన్లు, వర్షంలో తడవడం, జలుబు, గొంతు నొప్పి, దగ్గు ఇలాంటి చెవి నొప్పికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
మిమ్మల్ని కూడా చెవి నొప్పి ఇబ్బంది పెడుతుందా.. అయితే దాని నుంచి ఉపశమనం పొందడానికి ఈ టిప్స్ పాటించి చూడండి.
తులసి ఆకు రసాన్ని చెవిలో వేస్తే క్షణాల్లో నొప్పి నుంచి ఉపశమనం పొందుతారట.
చెవి నొప్పి తగ్గించడంలో ఉప్పు ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో ఉప్పు గోరు వెచ్చగా వేడి చేసుకుని దాన్ని ఓ కాటన్ క్లాత్ లోకి తీసుకుని మూట కట్టుకోవాలి. తర్వాత చెవి దగ్గర్ నొప్పి ఉన్న చోట దానిని అద్దుకోవాలి.
చెవులు ఎప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవాలి. తడి తగలకుండా, చలిగాలి చెవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటే నొప్పి వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా చెవులను నీటిగా ఉంచుకోవాలి.
దగ్గు, జలుబు కారణంగా కూడా చెవి నొప్పి వస్తుంది కాబట్టి.. మొదట వాటిని తగ్గించుకోవాలి. ఈ మేరకు వైద్యులను సంప్రదించి మందులు ఉపయోగించాలి.
ఇయర్ బడ్స్ వాడటం తగ్గించాలి. ముఖ్యంగా ఇతరులు వాడిన ఇయర్ ఫోన్‌లు మీకు ఉపయోగించకుంటా ఉంటే మంచిది.