మాంసం ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..?

మన శరీరానికి పోషకాలు చాలు అవసరం. అయితే చాలా మంది మాంసం వంటి ఆహారాల్లో ప్రోటీన్స్ లభిస్తాయని భావిస్తారు.
చికెన్‌తో ప్రోటీన్లు లభించినప్పటికీ.. దాని వల్ల వచ్చే ప్రమాదాలు కూడా అధికంగానే ఉంటాయి.
చాలా మందికి మాంసం అంటే పిచ్చి. అందులోను పోషకాలు కూడా లభిస్తాయి అన్నట్లు సందర్భం ఏదైనా మొదట చికెన్‌కె ప్రాధాన్యం ఎక్కువ ఇస్తారు.
కొంతమంది మాంసం ప్రియులు అయితే ముక్క లేనిదే ముద్దు దిగదు అన్నట్లుగా వ్యవహరిస్తారు.
దీంతో మోతాదుకి మించి మాంసం తినడంవలన మధుమేహ వ్యాధి భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.
అంతేకాదు ఈ మధ్య కాలంలో మధుమేహ వ్యాధి భారిన పడుతున్న వారిలో ఎక్కువ శాతం మొతాదుకి మించి మాంసం తీసుకున్న వారే ఉన్నారని పలు అధ్యయనాలలో కూడా తేలింది
మాంసంలోని పోషక విలువలు రక్తంలో జీర్ణం కావటానికి ఎక్కువ సమయం తీసుకుంటాయని అందుకే ఈ సమస్యలు వస్తున్నాయని డాక్టర్స్ చెబుతున్నారు.