టమాటా గింజలు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

టమాటాలో గింజలను కొంత మంది తింటారు.. మరికొందరు పడేస్తారు. అయితే ఈ గింజలు తినడం ప్రమాదమా.. ఆరోగ్యమా..? నిపుణులు ఏం అంటున్నారో తెలుసుకుందాం.!
టమాటా గింజల్లో విటమిన్ C, K, E తో పాటు ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి మనకు అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని ఇస్తాయి.
టమాటాల్లో గింజల తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అధికబరువుతో బాధపడేవారికి బరువు తగ్గించడంలో ఇది సహాయపడుతోంది.
టమాటా తినడం వల్ల కడుపు నిండినట్లు ఉంటుంది. తద్వారా ఆకలి తగ్గించి అధిక బరువు పెరగకుండా చేస్తాయి.
టమాటా గింజల్లో ఉండే లైకోపీన్.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది. చెడు కొలెస్ట్రాల్‌ని కరిగిస్తుంది.
టమాటా గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో చెడు వ్యర్థాలు, విష వ్యర్థాలను తొలగించి.. క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా చేస్తాయి.
ఈ గింజల్లో ఉండే కాల్షియం, ఫాస్పరస్ వంటివి ఎముకలు బలంగా ఉండేలా చేసి.. కీళ్లనొప్పులు, ఎముకలు బోలుగా అవ్వడం వంటి సమస్యలు రాకుండా చేస్తాయి.
అయితే కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు టమాటా తినకూడదని అంటారు. అలాగే కొంత మందికి టమాటో అరగదు. అలాంటి వారు డాక్టర్లు సూచించినట్లుగా చేస్తే మంచిది.
నోట్: పైన తెలిపిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇచ్చినవి. ఏ సమస్య వచ్చిన వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది.