సీతాఫలాలు ఎక్కువగా తింటున్నారా.. ఈ అనారోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్త!

వర్షాకాలంలో మార్కెట్‌లో విరివిగా దొరికే సితాఫలాలు చిన్నా పెద్ద ఎంతో ఇష్టంగా తింటుంటారు.
అయితే వీటిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
సీతాఫలం పండును తినడం వల్ల దురద, దద్దుర్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం మంచిది. ఇందులో ఉండే ఫైబర్ కడుపునొప్పి, విరోచనాలు, గ్యాస్ వంటివి వచ్చేలా చేస్తుంది.
ఐరన్ ఉండటం వల్ల సీతాఫలం ఎక్కువగా తింటే వాంతులు అవుతాయట.
ఈ పండ్లను తీసుకోవడం వల్ల మైకం, మూర్చ, డిహైడ్రేషన్ వంటివి తలెత్తుతాయి.
క్యాలరీలు, చక్కెర అధికంగా ఉన్నందున బరువు పెరగవచ్చును.
రక్తపోటు, డయాబెటిస్ వంటి వాటితో బాధపడేవారు డాక్టర్ సలహా తీసుకుని సీతాఫలాలు మితంగా తినాలి. లేదంటే ప్రమాదంలో పడతారు.