కీరదోస ఎక్కువగా తింటున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే?

వేసవిలో వేడి తాపాన్ని తట్టుకునేందుకు చాలా మంది కీరదోసకాయలను ఎక్కువగా తింటుంటారు.
అయితే కీరదోసను అధికంగా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
రాత్రిపూట దోసకాయ తినడం వల్ల ఊపిరితిత్తులలో శ్లేష్మం పేరుకుపోవడంతో పాటు దగ్గు వచ్చే అవకాశం ఉంది.
అలాగే కీర దోసను ఎక్కువగా తినడం వల్ల ప్రేగు కదలికపై అంతరాయం ఏర్పడుతుంది. అంతేకాకుండా తరచూ మూత్రవిసర్జన కూడా సంభవిస్తుంది.
కీరదోసను ఎక్కువగా తింటే అందులో ఉండే విటమిన్స్ పరిమాణం పెరిగి రక్తం గట్టే అవకాశం ఉంది.
సైనసైటీస్ వ్యాధితో బాధపడేవారు కీరదోసకు దూరంగా ఉండటం మంచిది. లేదంటే సమస్య మరింత పెరిగి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
గర్భిణీలు కీరదోసను తింటే అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. తరచూ మూత్ర విసర్జనకు గురవుతారు.
కీరదోస లో ఉండే పొటాషియం వల్ల కడుపు నొప్పి, కిడ్నీ సమస్యలు వస్తాయి.
వీటిని దృష్టిలో పెట్టుకుని కీరదోసను అధికంగా తినడం మానుకోవడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది.