పాలు ఆరోగ్యానికి మంచివని ఎక్కువగా తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

పాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తాయని చిన్నా పెద్ద పొద్దున లేవగానే, రాత్రి పడుకునే ముందు తాగుతారు.
అయితే ఇందులో ఉండే పోషకాలతో శరీరానికి లాభాలున్నప్పటీ అధికంగా తీసుకుంటే నష్టాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాలలో ఉన్న లాక్టోస్ కడుపు నొప్పి, విరేచనాలు, జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.
పాలను అధికంగా తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన గుండెపోటు వస్తుంది.
పాలు అతిగా తాగడం వల్ల కొలెరెక్టల్, ప్రోస్టేట్, బ్రెస్ట్, స్టోమిక్ వంటి క్యాన్సర్లు వస్తాయి.
పాలను ఎక్కువగా సేవిస్తే చర్మంపై అలర్జీలు వచ్చి పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాల్షియం అధికంగా ఉండే పాలు అధిక వినియోగం వల్ల పిల్లలలో ఊబకాయానికి కారణమవుతుందని తల్లిదండ్రులు గమనించాలి.
పాలు తీసుకోవడం వల్ల మొటిమలు మరింత తీవ్రతరం అవుతాయి. దీంతో చాలా అసహనంగా అనిపిస్తుంది.