చల్లగా, టేస్టీగా ఉందని కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారా..? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే..

ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో దాహం వేస్తే ఎవరికైనా సరే ముందుగా కూల్ డ్రింక్స్ గుర్తుకొస్తాయి.
ఒకప్పడు ఇంటికి అతిథులు వస్తే వాటర్ లేదా మజ్జిక ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం రోజుల్లో డైరెక్ట్ ఫ్రిడ్జ్‌లో నుంచి కూల్ డ్రింక్స్ తీసి ఇస్తున్నారు.
అయితే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనకు తెలియకుండానే మన శరీరంపై దారుణమైన ప్రభావం చూపుతుందంటున్నారు.
కూల్ డ్రింక్స్‌లో ఉండే ఫాస్పరస్ యాసిడ్ వల్ల ఎముకల్లో కాల్షియం తగ్గిపోతుంది. ఎముకలు చాలా వీక్ అయి, చిన్న చిన్న ప్రమాదాలకే విరిగిపోతాయి.
గుండెపని తీరు మందగిస్తుంది. హార్ట్ ఎటాక్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.
డయాబెటిస్ వ్యాధి రావడానికి కూల్ డ్రింక్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.
ఎసిడిటీ, జీర్ణ సమస్యలతో పాటు.. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ బారిన పడటానికి కూల్ డ్రింక్స్ కారణమవుతాయి.
మీ ఇంట్లో యూజ్ చేసే వాష్ బేసిన్‌లో ఒకసారి కూల్ డ్రింక్ పోసి చూడండి.. ఇందులో ఉన్న యాసిడ్ వాష్ బేషన్‌ను పూర్తిగా క్లీన్ చేస్తుంది.
డేంజరస్ శీతల పానీయాలు తాగకుండా ఉండటమే బెటరని నిపుణులు సూచిస్తున్నారు.