బంగారం కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే?

ప్రస్తుతం పెళ్లీల సీజన్, ఏప్రిల్ 22న అక్షయ తృతీయ కావడంతో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి.
అయితే హిందువులు అక్షయ తృతీయ రోజున కచ్చితంగా బంగారం కొనుగోలు చేస్తారు. బంగారం కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలట.
బంగారం కొనుగోలు చేసేటప్పుడు దానిపై BIS హాల్ మార్క్ కలిగి ఉందో లేదో గమనించాలి. అలాగే ఈ హాల్‌మార్క్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క త్రిభుజాకార చిహ్నాన్ని కలిగి ఉన్న వాటిన మాత్రమే కోనాలి.
బంగారం స్వచ్ఛతను కనుగోనాలంటే ఒక బకెట్‌లోని నీటిలో నగలను వేయాలి. అవి మునిగిపోతే బంగారం స్వచ్ఛమైనదని అర్థం.
బంగారం నకిలీదా నిజమైనదా అని తెలుసుకోవాలంటే నగలపై కొన్ని వెనిగర్ చుక్కలను వేయాలి. అవి కలర్ మారకపోతే నిజమైన బంగారమన్నట్లు.
గోల్డ్ నకిలీవని అనుమానం ఉంటే అయస్కాంతంతో చెక్ చేయాలి. నగలలో కదలిక కనిపిస్తే బంగారంలో నకిలీది కలపబడినట్లేనట.