పెళ్లైన తర్వాత ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు.. అస్సలు చేయొద్దు..!
పెళ్లికి ముందు ఎంతో సంతోషంగా ఉండే కొందరి జీవితాలు.. పెళ్లైన తర్వాత తారుమారవుతాయి.
అయితే.. పెళ్లికి ముందు లైఫ్‌కు పెళ్లైన తర్వాత లైఫ్‌కు చాలా తేడా ఉంటుంది. ఈ విషయం తెలియక చేసే చిన్న చిన్న తప్పులే గొడవలకు కారణం అవుతాయి. అవి ఏంటో తెలుసుకుందాం..
చాలా మందికి తన భాగస్వామి తమ మాట వినాలి అనుకుంటారు. దీంతో కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. దీంతో మొదటికే మోసం వచ్చి గొడవలు స్టార్ట్ అవుతాయి.
అసూయ అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది. కానీ, ఇతరుల పట్ల చూపించినట్లు మన భాగస్వాముల పట్ల ఈ అసూయ అనేది కొనసాగితే కష్టం అవుతుంది.
భాగస్వాములతో వీలైనంత ఎక్కువగా ప్రేమగా, ఫ్రెండ్లీగా ఉండేందుకు ప్రయత్నించాలి. అలా కాకుండా బెదిరించో, భయపెట్టో పనులు చేయించాలి అనుకుంటే గొడవలు స్టార్ట్ అవుతాయి.
ఎదుటి వ్యక్తుల ముందు తమ పార్టనర్‌ను తక్కువ చేసి మాట్లాడినా, అవమానించినా వారు తట్టుకోలేరు. కాబట్టి వారిని గౌరవించడం నేర్చుకోండి. అన్యోన్యత అదే పెరుగుతోంది.
దాంపత్య జీవితంలో అతి ముఖ్యమైనది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండటం. అంతే కానీ, నువ్వు అలా ఉన్నావ్ ఇలా ఉన్నావ్ అంటూ బాడీ షేమింగ్ చేయకూడదు.
భాగస్వామిని వేధింపులకు అస్సలు గురిచేయకూడదు. అలా చేసిన వారి దాంపత్య జీవితం ఎంతో కాలం ఉండదు.
సంపాదన విషయంలో, ఖర్చు్ల్లో ఒకరికి ఒకరు చెప్పుకోవాలి. దాంపత్య జీవితంలో అధికంగా ఖర్చుపెట్టడం, లేక అస్సలు ఖర్చు పెట్టకపోవడం రెండు మంచిది కాదు. ఇలాంటి విషయాలు గొడవలకు ప్రధాన కారణంగా మారతాయి.