బొద్దింకలు వేధిస్తున్నాయా.. అయితే ఈ టిప్స్ ఫాలోవ్వండి?
ఇంట్లో పలు ప్రదేశాల్లో బొద్దింకలు తిరుగుతూ చిరాకు తెప్పిస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఆహార పదార్థాలపై పాకుతూ విరక్తి కలిగిస్తుంటాయి.
అయితే వాటిని తరిమి కొట్టి ఉపశమనం పొందాలంటే ఈ టిప్స్ కచ్చితంగా పాటించాలి.
వేప ఆకుల రసం లేదా, నూనెను తీసుకుని ఇంటి మూలల్లో పిచికారీ చేయాలి. దాని వాసనకు బొద్దింకలు శాశ్వతంగా పారిపోతాయి.
అలాగే వంటింట్లో ఉండే బిర్యానీ ఆకులను పొడి చేసుకోవాలి. రెండు చెంచాల పొడిని నీటిలో వేసుకుని మరిగించి చల్లారిన తర్వాత స్ప్రే చేసుకుంటే మంచిది.
లవంగాల పొడి ఇళ్లంతా చల్లితే దాని ఘాటు వాసనకు బొద్దింకలు ఇంట్లో నుంచి బయటకు పోతాయి.
బొద్దింకల భయాన్ని దూరం చేయడంలో బేకింగ్ సోడా కూడా మంచి పాత్ర పోషిస్తుంది. టీ స్పూన్ సోడాలో కొంచెం చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని పగుళ్ల దగ్గర చల్లాలి.
మిరియాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి మూడింటిని కలిపి పేస్ట్ సిద్ధం చేయాలి. ఒక లీటరు నీటిలో దానిని కరిగించండి. ఆ తర్వాత బొద్దింకలు ఉన్న చోట చల్లితే మంచి ఫలితం ఉంటుంది.