బియ్యంలో పురుగులు పడుతున్నాయా.. అయితే ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి!

ప్రస్తుతం ఉన్న బిజీ బిజీ జీవితంలో చాలా మంది బియ్యాన్ని ముందే తెచ్చి ఇంట్లో నిల్వ పెట్టుకుంటారు.అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల బియ్యానికి తొందరగా పురుగులు పడుతాయి.
బియ్యంలో పట్టిన్న పురుగులను వదిలించాలంటే ఈ టిప్స్‌ను ఫాలో అవ్వండి.
బియ్యం నిల్వ ఉంచిన బస్తాల్లో ఆరేడు బిర్యానీ ఆకులను ఉంచి మూట కడితే ఘాటైన వాసనకు పురుగులు పారిపోతాయి.
అలాగే సుగంధ ద్రవ్యాల్లో ఒకటి లవంగాలు వీటి నూనెను బియ్యానికి స్రే చేస్తే పురుగులు పట్టవు.
వెల్లుల్లిని పొట్టు తీసి బియ్యంలో కలపాలి. అలా చేయడం వల్ల పురుగులు ఉండవు.
అగ్గిపెట్టెలో సల్ఫర్ ఉంటుంది. కాబట్టి అగ్గిపెట్టెలను తెరిచి బియ్యం బస్తాల చుట్టు పక్కల పెట్టాలి.
నల్ల మిరియాలను పొడిగా చేసి బియ్యంలో చల్లడం వల్ల పురుగులను తరిమికొట్టొచ్చు.
బియ్యంలో అల్లం ముక్కలను కలపడం ద్వారా పురుగులు పోయి బియ్యం క్లీన్‌గా ఉంటాయి.