అలాగే ఇంటి ముందు మురికి వాడల్లో వాలి ఆ తర్వాత ఇంట్లోకి రావడంతో పలు అనారోగ్య సమస్యలు వస్తాయని ప్రజలు భయాందోళనకు గురతుంటారు. అలా కాకుండా ఈగలను తరిమికొట్టేందుకు ఈ చిట్కాలు కచ్చితంగా పాటించాలి.
ఆపిల్ సైడర్ వెనిగర్‌ను, డిష్ వాషింగ్ లిక్విడ్‌తో కలిపాలి. ఆ తర్వాత ఒక గ్లాస్‌ను తీసుకుని అందులో దానిని పోసి రబ్బర్‌తో బాగా కవర్ చేయండి. ఆ కబ్బర్‌కు చిన్న చిన్న రంధ్రాలు చేసి ఈగలు ఉండే చోట పెడితే మంచి ఫలితం ఉంటుంది.
ఒక స్ప్రే బాటిల్ నిండా నీటిని తీసుకుని అందులో రెండు చెంచాల ఉప్పు వేసి దానిని ఇళ్లంతా చల్లుకోవాలి. దీంతో ఈగలు ఇంట్లోంచి పారిపోతాయి.
సహజంగా వచ్చే పుదీనా, తులసి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అలాగే ఇవి రెండిని కలిపి పేస్ట్‌లా చేసి పిచికారీ చేస్తే ఈగలను తరిమికొట్టొచ్చు.
పాలల్లో మిరియాలను వేసుకుని తాగితే వర్షాకాలం వచ్చే ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయని అందరికీ తెలిసిందే. ఆ పాలను ఈగలు ఉన్న చోట పెడితే అవి దీనిపై వచ్చి వాలడం వల్ల ఆ ఘాటు వాసనకు అవి చచ్చిపోతాయి.