ఇంట్లో చీమలు వేధిస్తున్నాయా.. అయితే ఈ చిట్కాలతో తరిమికొట్టండి..!
ఇంట్లో చీమలు అన్ని ఆహార పదార్థాలలోకి వెళ్లి అన్నిటినీ పాడు చేస్తాయి. వంట దినుసులకు జాగ్రత్తగా కాపాడుకోకపోతే అన్ని నాశనం అవుతుంటాయి.
అయితే చీమలను తరిమికొట్టాలంటే ఈ సింపుల్ చిట్కాలను పాటించి వాటి బెడద నుంచి బయటపడవచ్చు. వంటకాల్లో ఉపయోగించే మిరియాలు ఎంతో ఘాటుగా ఉంటాయి. వీటిని పొడి చేసి చీమలు ఉన్నచోట చల్లితే మంచిది.
అలాగే నారింజ పండును తిన్న తర్వాత వాటి తొక్కలను చీమలు తిరిగే ప్రదేశంలో వేయాలి.
పుల్లగా ఉండే నిమ్మకాయ వాసనను చీమలు తట్టుకోలేవట. కాబట్టి నిమ్మ రసాన్ని చీమలు ఉన్న చోట చల్లాలి.
మసాలా దినుసుల్లో ముఖ్యమైన దాల్చిన చెక్క దాని పొడిని చీమలు ఉన్న చోట చల్లితే ఆ ఘాటు వాసనకు అవి పారిపోతాయి.
అలాగే వైట్ వెనిగర్ రుచిని, వాసనను కలిగి ఉంటుంది. అందువల్ల చీమలు ఉన్నచోట దీనిని స్ర్పే చేస్తే మళ్లీ చీమలు రావు.
అన్ని కూరల్లో ఉప్పు లేకుంటే ఏ పదార్థం అయినా టేస్ట్ లెస్‌గా అనిపిస్తుంది. అలాంటి ఉప్పు చీమలు ఉన్న చోట చల్లితే మంచి ఫలితం ఉంటుంది.
వేప నూనెతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అందరికీ తెలిసిందే. అయితే వేప ఆయిల్ చీమలు తిరిగి ప్రాంతంలో చల్లితే అవి పారిపోతాయి.