అయితే అలా చేయడం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. ఏ రోజున తలకు నూనె పెట్టుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
బిజీ బిజీ జీవితంలో అందరికీ సెలవు రోజు ఆదివారం నాడు హెయిర్‌కు ఆయిల్ పెట్టుకుంటే అశుభం జరుగుతుంది. వారంలో మొదటి రోజు అలా చేయడం మంచిది కాదు.
అలాగే శుక్రవారం నూనె రాసుకుంటే అప్పుల బారిన పడతారు. ఇంట్లో కర్చులు కూడా ఎక్కువగా మారి ధనం విపరీతంగా ఖర్చు కావడంతో పలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
గురువారం నాడు గురుగ్రహ బలం ఎక్కువగా ఉండి కుటుంబం సమస్యలు, కష్టాలకు దారి తీస్తోంది.
కొంత మంది పని మొత్తం పూర్తి అయ్యాక రాత్రి తలకు నూనె రాసుకుని పడుకుంటే మంచిగా నిద్ర పడుతుందని అలా చేస్తుంటారు. కానీ, అలా చేస్తే అనారోగ్య సమస్యలు, దరిద్రం వెంటాడుతుంది.
తల స్నానం చేసిన తర్వాత పొడిబారక ముందు నూనె పెట్టుకుంటే మానసిక ఒత్తిడి, ఐశ్వర్యం కోల్పోతారు. అలాగే కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి.
శనివారం శరీరానికి లేదా, జుట్టుకి నూనె పట్టించి అభ్యంగన స్నానం చేయడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పాపాల నుంచి విముక్తి కూడా లభిస్తుంది.
పుట్టిన రోజున నువ్వుల నూనెతో రాసి అభ్యంగన స్నానం చేస్తే జాతకంలోని సకల దోషాలు తొలగిపోతాయి.