కోపం ముంచుకొస్తుందా.. అయితే ఈ టిప్స్‌తో చెక్ పెట్టండిలా?

ఇటీవల చాలా మంది వివిధ కారణాలతో కోపానికి గురైరవుతున్నారు. అదే కోపంతో ఇతరుల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారు.
కోపం వచ్చిన సమయంలో అడ్రినలిన్, కార్టిసాల్ అనే హార్మోన్స్ విడుదలవుతాయి. దీని వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
అయితే కోపం తగ్గించుకొని శాంతంగా మారాలంటే ఈ టిప్స్ కచ్చితంగా పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కోపం వచ్చే సూచనలు కనిపిస్తే ఒక గ్లాసు నీళ్లు తాగితే కోపం రాకుండా శాంతంగా మారుతారు.
అలాగే కోపంగా ఉన్న సమయంలో మీ దృష్టిని మళ్లించడానికి లాంగ్ బ్రీత్ తీసుకొని 1 నుంచి 10 అంకెలు లెక్కపెట్టడం మంచిది.
కోపం రాకుండా ఉండటానికి ఏవైనా గేమ్స్, వంట, డ్యాన్స్, పాట వంటివి చేయడం వల్ల కోపం రాదట.
తరుచూ ఒకే విషయం గురించి అదేపనిగా ఆలోచించకుండా పరిస్థితి ఏదైనా గతం గతహా అంటూ వాటన్నీటిని మర్చిపోవాలి.
చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చేవారు ధ్యానం చేస్తే కోపానికి గురి కాకుండా ఉంటారు.
ఇరిటేట్ చేసే అంశాలకు, వాదించే వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నించడం వల్ల కోపం రాదు.