వేసవిలో కోకుమ్ పండ్లను తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు..

వేసవిలో ఎండలకు తట్టుకునేందుకు నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తింటుంటారు.
అయితే ముఖ్యంగా కోకుమ్ పండ్లు వేసవి తాపాన్ని తీర్చేందుకు ముఖ్యమైనవని నిపుణులు చెబుతున్నారు.
కోకుమ్ పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉండి రోగనిరోధక శక్తిని పెంచి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతాయి.
కోకుమ్ షర్బత్ తాగడం వల్ల అసిడిటీ, జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి.
ఈ పండ్లలో పీచు పదార్థాలు, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి వీటిని తింటే గుండెకు సంబంధించిన సమస్యలు రావు.
మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు కోకుమ్ పండ్లు తింటే మంచి ఫలితం లభిస్తుంది.
ఒక గ్లాసు కోకుమ్ రసం తాగితే మండే వేడి నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా రక్షిస్తుంది.
వృద్ధాప్య లక్షణాలు రాకుండా యవ్వనంగా ఉండాలనుకునేవారు కోకుమ్ పండ్లు తినడం మంచిది.