ఉదయాన్నే తమలపాకులను తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే..!

తమలపాకులో ఉండే ఔషధ గుణాలు శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున తమలపాకులను తినడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పొద్దున్నే తమలపాకులో కొంచెం సున్నం వేసుకుని తింటే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి.
అలాగే స్త్రీ, పురుషులు హర్మోన్ల సమస్యలతో బాధపడితే కచ్చితంగా తమలపాకులను తినాలి.
ప్రతిరోజూ తమలపాకులను ఉదయం పూట తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
పరగడుపున తమలపాకులను తింటే పంటి నొప్పి, చిగుళ్ల వాపు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
మలబద్ధకం వేధించేవారు ఉదయాన్నే ఈ ఆకులు తింటే మంచి ఫలితం లభిస్తుంది.
తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, కెరోటిన్, కాల్షియం ఉండి పలు రకాల ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతాయి.
గాయాలు, నొప్పులు ఉన్నచోట తమలపాకుల పెస్ట్‌ను రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది.