ఉసిరి ఆకులతో కలిగే అద్భుత ప్రయోజనాలు

ఉసిరి కాయలతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే.
కానీ, ఉసిరి ఆకులతో కూడా మంచి ఔషద గుణాలు ఉడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటితో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
ఉసిరి ఆకుల జ్యూస్ మజ్జికలో కలుపుకుని తాగితే కడుపునొప్పి, అజీర్తి, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
ఈ ఆకులను కషాయంలా చేసుకుని అందులో ఉప్పు కలిపి పుక్కులిస్తే గొంతునొప్పి, నోటిపూత తగ్గుతాయి.
వీటిని మెత్తని పెస్ట్‌లా చేసి తేనెను మిక్స్ చేసి ప్యాక్‌లా వేసుకుంటే ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గి కాంతివంతంగా మారుతుంది.
పరిగడపున ఉసిరి ఆకుల రసాన్ని తాగితే కామెర్లు తగ్గుముఖం పడతాయి.
చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు ఉసిరి ఆకులను వేయించి పొడిగా చేసి కొద్దిగా ఆవనూనె వేసి నెమ్మదిగా రాసుకోవడం మంచిది.