అలర్ట్: పిడుగుల బారి నుండి ప్రాణాలు రక్షించుకోవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే?

ప్రస్తుతం అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అయితే పిడుగులు పడకుండా మన ప్రాణాలను కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
ఉరుములు, మెరుపులు వచ్చేలా ఉంటే ఇంట్లో ఉండాలి. ఒకవేళ బయట ఉంటే వెంటనే ఇంటికి చేరుకోవడం మంచిది.
కార్లలో ప్రయాణిస్తున్నప్పుడు, లేదా కూర్చొని ఉన్నా బయటకు దిగి ప్రమాదంలో పడటం కంటే అందులోనే కూర్చోవాలి.
అలాగే వర్షం వచ్చే సూచన కనిపించినప్పుడు ఒంటరిగా పొడవైన చెట్ల కింద ఉండకూడదు. లేదంటే పిడుగుపాటుకు గురి కావాల్సి వస్తుంది.
వర్షం వచ్చే సమయంలో పొలంలో పనిచేసే రైతులు వెంటనే ఇళ్లకు చేరుకోవాలి.
భూమి మీద పూర్తిగా అరికాళ్లు పెట్టకుండా వేళ్ల మీద కూర్చోవాలి లేదా నిల్చోవాలి. ఇలా చేయడం వల్ల పిడుగుపాటు నుంచి బయటపడే అవకాశం ఉంది.
వర్షం వచ్చేటప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి. అలాగే కరెంట్‌ పనులు చేయకూడదు.
మొబైల్ ఫోన్, ఎఫ్‌ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించకుండా ఉండాలి.
వర్షం వచ్చినప్పుడు మోకాళ్లపై చేతులు, తల పెట్టి దగ్గరగా ముడుచుకొని కూర్చోవడం వల్ల పిడుగుపాటుకు గురికాకుండా ఉండొచ్చు. అలా అని ఎక్కువ సేపు ఉండకూడదు.
మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లో టీవీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, వాషింగ్ మెషీన్లు అపేయాలి. లేదంటే హై వొల్జేజీ ప్రవహించి కాలిపోతాయి.