ఈ కోమలి అందానికి బ్రహ్మ అయినా దాసోహం కాక మానదు.. ఐశ్వర్య రాజేష్..
ఐశ్వర్య రాజేష్ తెలుగుమ్మాయే.. హాస్య నటి శ్రీలక్ష్మి మేనకోడలు, ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసి అతి చిన్న ఏజ్‌లోనే మరణించిన హీరో రాజేష్ కుమార్తె ఈమె.
ఐశ్వర్య రాజేష్ 1190 జనవరి 10న జన్మించింది. అయితే చాలా చిన్న వయసు నుంచే ఎన్నో కష్టాలను అనుభవించింది.
సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అనే కామెడీ షోలో యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఐశ్వర్య.. ఇవర్గలం సినిమాలో ఫ్రెండ్ పాత్ర పోషించింది.
ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో పరిచయమైంది.
అయితే తెలుగు భామ అయిన ఐశ్వర్య రాజేష్‌కు తమిళ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ అక్కడ హీరోయిన్‌గా రాణిస్తూ అదరగొడుతుంది.
రీసెంట్‌గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో నలుగురి పిల్లల తల్లిగా, వెంకటేశ్ భార్యగా నటించి ఆడియన్స్‌ను మోప్పించింది.
అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. వాటిని చూసిన నెటిజన్లు ఈ కోమలి అందానికి బ్రహ్మ అయినా దాసోహం కావాల్సిందే అని కామెంట్స్ చేస్తున్నారు.