మెనోపాజ్ సమయంలో కాల్షియం చాలా ముఖ్యం. దీంతో ఎముకలు బలహీనపడవు. కాబట్టి పాలు, పెరుగు, గుడ్లు, చేపలు ఎక్కువగా తినండి. ఉప్పు, సోడియం తక్కువగా తినండి. ఎందుకంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత శరీరంలో అనేక రకాల సమస్యలు పెరుగుతాయి.
వ్యాయామం, యోగా కోసం సమయం కేటాయించండి. వ్యాయామం చేయడం ద్వారా మీకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ధ్యానం, యోగా మంచి ఆరోగ్యానికి చాలా కీలకం. ఇది ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. అంతేకాకుండా మెదడు శక్తిని పెంచుతుంది.
ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత మహిళల్లో అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది అండాశయాలలో మొదలై శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. అండాశయ క్యాన్సర్ ఏ వయసులోనైనా రావచ్చు. 50 ఏళ్లు పైబడిన మహిళల్లో ఈ వ్యాధి చాలా సాధారణం.
‘అమెరికన్ క్యాన్సర్ సొసైటీ’ ప్రకారం, అండాశయ క్యాన్సర్ కేసులలో సగం 63 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో సంభవిస్తుంది.