అధిర బరువు: అధిక బరువు కారణంగా మెడ చుట్టు కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల గొంతుపై ఎఫెక్ట్ పడటంతో గురక వస్తుంది. సాధ్యమైనంత వరకూ బరువు తగ్గిస్తేనే గురకను నియంత్రించవచ్చు.
స్లీప్ పొజిషన్ మార్చడం: సైడ్‌కు పడుకోవడం వల్ల నాలుకకు విశ్రాంతి లభిస్తుంది. దీంతో నాలుక గొంతును అడ్డుకోకుండా సహాయపడుతుంది.
ఆల్కహాల్ పరిమితం చేయండి: ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శ్వాసనాళాల్లో కండరాలు సడలించడంతోపాటు గురకను మరింత పేంచే అకాశం ఉంటుంది. పడుకునే ముందు కనీసం 4 నుంచి 5 గంటల ముందు తాగడం ఆపేయడం వల్ల గురకను గణనీయంగా తగ్గించవచ్చు.
ధూమపానం మానేయండి: ధూమపానం గొంతు వాపుకు దారి తీస్తుంది. ఫలితంగా గురక మరింత తీవ్రతరం అవుతుంది. ధూమపానానికి దూరంగా ఉన్నవాళ్లలో ఈ సమస్య చాలా తక్కువ.
మెడిసిన్ ఎఫెక్ట్ : కొన్ని మత్తుమందులు, యాంటిహిస్టామైన్‌లు కూడా గురకను ప్రేరేపిస్తాయి. అవసరమైన దానికంటే ఎక్కువ మోతాదులో డోస్ వాడేముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
నోరు తెరవడం మానుకోండి: నోరు తెరిచి ఉన్నపుడు గురక పెట్టడం సాధారణంగా జరిగే ప్రక్రియ. కాబట్టి నిద్రించేటప్పుడు నోరు మూయడం అలవాటు చేసుకోండి. లేదంటే టేప్ లేదా ఏదైనా తక్కువ మోతాదులో అంటుకునే గమ్ లాంటి పరికరాన్ని ఉపయోగించడం మేలు.
ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించడం: మాండిబ్యులర్ అడ్వాన్స్‌మెంట్ అనే పరికరం గురకతో బాధపడేవారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ పరికరం దవడను పై దవడకు అంటిపెట్టడంలో సహాయపడుతుంది.
ముక్కు రంధ్రాల్లో బ్లాక్స్: ముక్కు ఎక్కువ మొత్తంలో మూసుకుపోయి బాధపడేవారు డైలేటర్ స్ట్రిప్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇది వాయుమార్గాలను తెరిచి ఉంచడంలో సహాయపడుతూ గురకను తగ్గిస్తుంది.
అలెర్జీలకు చికిత్స చేయండి: అలెర్జీల కారణంగా గొంతు, ముక్కు మూసుకుపోవడం వల్ల గురక సాధారణంగా వస్తుంది. అలాంటపుడు ముక్కులో వెంట్రుకలు ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అలెర్జీ కారకాలను గుర్తించి తప్పనిసరిగా తగిన ట్రీట్‌మెంట్ చేయించుకోవాలి.