హిమోగ్లోబిన్ స్థాయిని పెంచే 5 చిట్కాలు..

శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగినంత లేకపోతే రక్తహీనతతో బాధపడుతున్నారని అర్థం. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే హిమోగ్లోబిన్ స్థాయి పెంచుకునేందుకు టిప్స్ అందిస్తున్నారు నిపుణులు.
1. విటమిన్ సి : ఆహారం నుంచి మనకు లభించే ఐరన్‌ను శరీరానికి చేరవేయడానికి విటమిన్ సి సహాయపడుతుంది. కాబట్టి జామ కాయ, ఉసిరి, నిమ్మ, బ్రోకలీ, కాలీఫ్లవర్, బొప్పాయి, స్ట్రాబెర్రీ, కివీ, క్యాప్సికమ్, టమోటా వంటి విటమిన్ సి పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి.
2. విటమిన్ B12 : విటమిన్ B12 అనేది జంతు ఉత్పత్తి ఆహారాలలో కనిపించే ముఖ్యమైన విటమిన్. ఈ విటమిన్ లోపం ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని అడ్డుకుంటుంది. రక్తహీనతకు దారితీస్తుంది. కాబట్టి ఈ విటమిన్ రిచ్ ఫుడ్స్ అయిన చేపలు, పాలు, గుడ్లు, పెరుగు, చిరు ధాన్యాలు, తృణ ధాన్యాలు, చికెన్ తీసుకోవాలి
3. ఐరన్ బ్లాకర్స్ : భోజనం సమయంలో టీ, కాఫీ, కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు వినియోగాన్ని తగ్గించాలి. ఎందుకంటే ఇవి ఐరన్ శోషణను నిరోధిస్తాయి.
4. దానిమ్మ : విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి, ఫైబర్, ఐరన్, పొటాషియం, జింక్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలతోపాటు ఆరోగ్యానికి అవసరమైన అనేక ఇతర పోషకాలను కలిగిన దానిమ్మ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.
5. సిట్రస్ ఫ్రూట్స్ : సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నారింజ, జామ, కివీస్, స్ట్రాబెర్రీస్, బెల్ పెప్పర్స్ తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.