- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సిరీస్‌గా క్లాసిక్ హీరోయిన్ సుమలత బయోపిక్..
దిశ, వెబ్‌డెస్క్ : బయోపిక్స్ ఎప్పుడు కూడా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటూనే ఉన్నాయి. రంగం ఏదైనా సరే.. అంచలంచెలుగా ఎదుగుతూ కలను సాకారం చేసుకునే ప్రతీ వ్యక్తి జీవితకథ కూడా స్ఫూర్తిని పంచేదే కాగా.. సినీ సెలెబ్రిటీల నుంచి క్రీడాకారులు, వ్యాపారవేత్తల వరకు తెరపై ఆవిష్కరించిన ప్రతీ జీవితకథ విజయవంతమైందే. తాజాగా వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా, షకీలా’ సినిమాలు కూడా ఈ కోవకు చెందినవే కాగా.. సినిమాల్లో క్లాసీ టచ్‌తో స్టార్‌గా ఎదిగిన హీరోయిన్ సుమలత జీవితం కూడా చాలా మందికి ఇన్‌స్పిరేషన్. ఈ క్రమంలోనే తన జీవితాన్ని సిరీస్ రూపంలో తీసుకొచ్చేందుకు సన్ననాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాత గురుదేశ్ పాండే. సుమలత పాత్రలో ఎవరు నటిస్తారనే విషయమై ఇంకా అప్‌డేట్ లేదు కానీ.. తన సినీ, రాజకీయ జీవితాన్ని తెరపై ఆవిష్కరించనుండటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తెలుగు అమ్మాయి.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ స్టార్ హీరోయిన్‌గా ఎదగడం.. అది కూడా ఎలాంటి గ్లామరస్ టచ్ లేకుండా అద్భుతమైన నటనతో కెరియర్‌లో ఫస్ట్ ప్లేస్ దక్కించుకోవడం ఆమెకే చెల్లింది. సినీ కెరియర్‌లో 110 చిత్రాలకు పైగా నటించి మెప్పించిన సుమలత.. 15 ఏళ్ల వయసులోనే సినీరంగ ప్రవేశం చేసింది. 1979లో ఆంధ్రప్రదేశ్ బ్యూటీ కాంటెస్ట్‌లో విన్ అయిన తనకు ముందుగా ఆఫర్ ఇచ్చింది నిర్మాత రామానాయుడు అయినా.. తమిళ్ చిత్రం ‘తిసాయి మారియా పరవైగల్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సుమలత. ఆ తర్వాత ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలు చేసిన ఆమె.. ఆ తర్వాత కన్నడ నటుడు అంబరీశ్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. భర్త మరణం తర్వాత పార్టీలు తనకు టికెట్ ఇచ్చేందుకు అంగీకరించినా.. మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్‌గా పోటీ చేసి ఘన విజయం సాధించారు సుమలత.