టూరిజంను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తాం: అవంతి

by srinivas |
టూరిజంను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తాం: అవంతి
X

దిశ,వెబ్ డెస్క్: అంతర్జాతీయ ప్రమాణాలతో టూరిజం రంగాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. టూరిజంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. ఏపీ టూరిజం కొత్త పాలసీని మంత్రి అవంతి శ్రీనివాస్ శనివారం ప్రకటించారు. టూరిజం రంగానికి కూడా రిస్టార్ట్ ప్యాకేజి అందిస్తున్నామని తెలిపారు.

టూరిజం రంగంలో ఉన్న ప్రైవేట్ సంస్థలకు రుణాలను అందిస్తామని పేర్కొన్నారు. మొత్తం రుణాలపై 9శాతం వడ్డీ కాగ అందులో 4.5 శాతం ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడించారు. స్పెషల్ పర్సస్ వెహికల్ ఏర్పాటు చేసి అనుమతులు సరళీకరణ చేస్తామని అన్నారు. పర్యాటకం రంగంలో హోటళ్ల నిర్మాణానికి 10 సంస్థలను ఆహ్వానించామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed