- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించే వరకు పోరాడుతాం
దిశ, భువనగిరి రూరల్ : భారత కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ముద్రించే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ మైనారిటీ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మహ్మద్ షానూర్ బాబా డిమాండ్ చేశారు. ఆదివారం భువనగిరి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహంకు జ్ఞానమాలను (34వ వారం) సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో బడుగు బలహీనవర్గాల, మైనారిటీ ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన అన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే దేశంలో బడుగు బలహీనవర్గాలకు ముఖ్యంగా మైనారిటీ ప్రజలు స్వేచ్ఛ గా జీవించ గలుగుతున్నారని ఆయన అన్నారు. దళిత బహుజన, మైనారిటీ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఆయన అన్నారు.
ఈ జ్ఞానమాల కార్యక్రమంలో సాధన సమితి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్ జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ సాధన సమితి జిల్లా నాయకులు భానోతు భాస్కర్ నాయక్ సాల్వేరు ఉపేందర్,బొడ్డు కృష్ణ, సిలివేరు రమేష్, సుక్క అశోక్, కృష్ణ మైనారిటీ నాయకులు మసూద్,జాహెద్, రషీద్, ఉస్మాన్,ఫయీమ్, తదితరులు పాల్గొన్నారు.