ఆస్పత్రి నుంచి మేం వెళ్లిపోతాం: కరోనా పేషెంట్లు

by Aamani |
ఆస్పత్రి నుంచి మేం వెళ్లిపోతాం: కరోనా పేషెంట్లు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లు ఆస్పత్రుల నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో సరైన సదుపాయలు లేవని కొందరు, ఇక్కడ ఉండడం ఇష్టంలేదని మరికొందరు ఇలా రకరకాలుగా కారణాలు చెబుతున్నారు. అయితే, వాస్తవ పరిస్థితి ఏందో తెలియడంలేదు. మరికొంతమంది మనోవేదనకు గురై ఆస్పత్రుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆదిలాబాద్ లో చోటు చేసుకుంది.

ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రిలో తల్లీకొడుకు కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. అయితే బుధవారం ఉదయం ఆస్పత్రి నుంచి పారిపోయేందుకు ఆ ఇద్దరు కరోనా పేషెంట్లు ప్రయత్నించారు. కోవిడ్ వార్డు నుంచి బయటకు వచ్చిన తల్లీకొడుకులను అక్కడే డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అడ్డుకున్నారు. దీంతో వారు తిరిగి కొవిడ్ రూంలోకి వెళ్లిపోయారు. రిమ్స్ లో ఉండేందుకు వారు ఇష్టపడటంలేదని తెలుస్తోంది. దీంతో వీరిని మరో కోవిడ్ సెంటర్ కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో కూడా ఈ విధంగా కొవిడ్ వార్డును ఓ పేషెంట్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు, సిబ్బంది వారించి లోపలికి పంపించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story