- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకుంటాం : నిరంజన్ రెడ్డి
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: చారిత్రక నేపథ్యం కలిగినటువంటి రాజోలి గ్రామం ఉమ్మడి పాలనలో అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించిన ఆయన రైతు వేదిక శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నవాబు పాలనలో ఉన్నటువంటి హైదరాబాద్ రాష్టానికి, మద్రాస్ రాష్టానికి సరిహద్దుగా ఉన్నటువంటి రాజోలి గ్రామం వర్తకులకు కేంద్ర బిందువుగా ఉండేదన్నారు.
తుంగభద్ర నది గుండా మద్రాస్ ప్రాంతానికి ఇక్కడినుండే సరుకు రవాణా జరిగేదని వివరించారు. ప్రసిద్ధి గాంచిన రాజోలి ప్రాంతానికి కొత్త మండలం ఏర్పాటు చేయడం ద్వారా తగిన గుర్తింపు కల్పించామన్నారు. చేనేత వృత్తి దారులు అధికంగా ఉన్న ఈ గ్రామంలో చేనేత జౌళి శాఖ మాత్యులు కేటీఆర్‌తో మాట్లాడి చేనేత కార్మికుల సమస్యలను పరిస్కారిస్తామన్నారు.
వడ్డేపల్లి, రాజోలి మండలంలో అధిక శాతంలో సాగు చేయబడిన ఉల్లి మరియు సుబాబుల పంటలకు తగిన మద్దతు ధర కల్పించి స్థానికంగా కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు అబ్రహం, జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, కన్స్యూమర్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, మాజీ జెడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ గౌడ్, మార్కెట్ చైర్మన్ రాందేవ్ రెడ్డి, జెడ్పీటీసీ సుగుణమ్మ,సర్పంచ్ వెంకటేశ్వరమ్మ గోపాల్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.