- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేము మరో 20 పరుగులు చేయాల్సింది -హర్మన్
దిశ, వెబ్ డెస్క్: జియో ఉమెన్స్ టీ20 చాలెంజ్ 2020లో భాగంగా బుధవారం రాత్రి షార్జాలో సూపర్‌నోవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సూపర్‌నోవాస్ జట్టుకు సరైన ఆరంభం లభించలేదు. చామరి అటపట్టు (44)తో కలసి కెప్టెన్ హర్మన్ ప్రీత్ (31) ఇన్నింగ్స్ చక్కదిద్దారు.
కానీ వెలాసిటీ కెప్టెన్ మిథాలి రాజ్ తన అనుభవాన్ని ఉపయోగించారు. బౌలర్లను మారుస్తూ వికెట్లు తీశారు. దీంతో సూపర్‌నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కి దిగిన వెలాసిటీ టీమ్ 19.5 ఓవర్లలో వెలాసిటీ 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. చివర్లో లుస్ ఫోర్ కొట్టడంతో వెలాసిటీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సూపర్ నోవాస్ టీమ్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
కాగా మ్యాచ్ అనంతరం సూపర్ నోవాస్ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ మాట్లాడుతూ… మేము మరో 20 పరుగులు చేయాల్సింది. నేను, అటపట్టు కలసి మంచి ఇన్నింగ్స్ నిర్మించాము. 150 పరుగులు చేయగలమనే అనుకున్నాం. కానీ చివర్లో వికెట్లు వరుసగా పడటంతో తక్కువ స్కోరుకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. మా బౌలర్లు వెలాసిటీ బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చారు. వచ్చే మ్యాచ్ గెలిస్తేనే ఫైనల్స్ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మేం పూర్తిగా కష్టపడతాం.