- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాకు పీకే అవసరం లేదు : జగ్గారెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ అక్కరే లేదని గాంధీభవన్‌కు వస్తే ఇక్కడ ఎంత మంది ప్రశాంత్ కిషోర్‌లు ఉన్నరో తెలుస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన ప్రశాంత్ కిషోర్‌కు పరిజ్ఞానం లేదన్నారు. సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్‌పై ప్రశాంత్ కిషోర్ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, తనకు తాను అతిగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్‌ఎస్ మాత్రమేనని టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ అని బీజేపీది థర్డ్ ప్లేస్‌లో ఉంటుందన్నారు. టీఆర్ఎస్‌తో దోస్తానా లేదని ఎప్పటికీ కొట్లాటే ఉంటుందని… అయితే ఎవరితో కలిసి పని చేయాలనేది ఢిల్లీలోనే నిర్ణయం తీసుకుంటారు తెలిపారు. కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఓడించడం మిగితా పార్టీలకు కలగానే ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మమత, కేసీఆర్‌కు వంద పార్లమెంట్ స్థానాలు వచ్చే అవకాశం ఉందా అని ఆయన ప్రశ్నించారు.
స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో 230 ఓట్లున్న కాంగ్రెస్‌ను చూసి టీఆర్ఎస్ భయపడుతుందని, అందుకే ఫిర్యాదులు చేస్తుందని మండిపడ్డారు. బలం ఉండి కూడా 300 మందిని నార్త్ ఇండియా టూర్ పంపింది ఎవరని, స్థానిక ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ క్యాంప్‌లకు తరలిస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కొప్పుల మంత్రిగా ఉండి ఓ కులాన్ని కించపరిచారని, దీనిపై ఎన్నికల కమిషన్ ఏం చర్యలు తీసుకుందన్నారు. 100 మందిని తిరుపతి తీసుకెళ్లి దర్శనం చేయిస్తున్నారని, పార్టీ ప్రజాప్రతినిధులకు దేవుడి దర్శనం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.