- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జానారెడ్డి సవాల్‌కు సిద్ధం: జగదీశ్ రెడ్డి
దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా అభివృద్దిపై కాంగ్రెస్ నేత జానారెడ్డితో చర్చకు తాము సిద్ధమేనని, ఆయన సవాల్‌ను స్వీకరిస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తెలిపారు. సమయం, వేదిక ఖరారు చేస్తే.. వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. నూతన వ్యవసాయ పంటలపై అవగాహన సదస్సులో భాగంగా గురువారం సాయంత్రం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరు దశాబ్ధాలుగా కాంగ్రెస్ చేసిన నిర్వాకాలను అదే వేదిక మీద ప్రజలకు వివరిస్తామన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో మొదలైన ఫ్లోరిన్ పీడ.. జిల్లా మొత్తం వ్యాప్తి చెందడానికి కాంగ్రెస్ పార్టీ నిర్వాకం కదా అంటూ ప్రశ్నించారు. ప్రజలకు తాగేందుకు గుక్కేడు మంచినీటిని ఇవ్వని కాంగ్రెస్.. నేడు అభివృద్ది గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఫ్లోరోసిస్‌తో ప్రజలు జీవచ్ఛావాలుగా మారుతున్నా.. ఆంధ్రోళ్లు ఇచ్చే బీ-ఫారాల కోసం నోరుమెదపని నేతలు.. ఎన్నికలనగానే నీతులు చెప్పడం పరిపాటిగా మారిందని చెప్పారు.