- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైనపు విగ్రహాలతో ‘భూతాపం’పై అవగాహన!
దిశ, వెబ్‌డెస్క్ :
గ్రీన్‌హౌస్ వాయువుల ప్రభావం పెరగడంతో.. భూతాపం కూడా పెరిగిందని ఇటీవలే ఐరాస నివేదికలో పేర్కొంది. ఈ కారణంగా జీవజాతులు ప్రమాదంలో పడటమే కాదు, సముద్రమట్టాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఫ్లోరిడాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్‌జీవో ఇన్‌స్టిట్యూషన్ సీఎల్ఈవో ‘మెల్టింగ్ ఫ్లోరిడా’ అనే ఓ సరికొత్త ప్రయత్నం చేసింది.
ఫ్లోరిడా సిటీ హాల్ ముందర ‘సీఎల్ఈవో’ సభ్యులు.. ఓ తాత, అతని మనవరాలుతో ఉన్న రెండు మైనపు విగ్రహాలను పెట్టారు. బయట ఉన్న ఉష్ణోగ్రతల కారణంగా ఆ రెండు విగ్రహాలు కరిగిపోతూ.. ‘ఎక్కువ ఉష్ణోగ్రత.. తక్కువ ఆరోగ్యం’ అనే ఓ మెసేజ్‌ను అందరికీ ఇస్తాయనే ఉద్దేశంతో ఈ ‘మెల్టింగ్ ఫ్లోరిడా’ అనే క్యాంపెయిన్ చేపట్టారు. ‘పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, క్లైమేట్ క్రైసిస్.. మన జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. మన ఆరోగ్యాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు ఇలానే పెరిగితే.. ఓజోన్ పొరకు కూడా నష్టం వాటిల్లుతుంది. అప్పుడు మానవజాతికి మరింత ప్రమాదం. రెస్పిరేటరీ డిసీజ్, గుండెకు సంబంధించిన అనారోగ్యాలు పెరుగుతాయి’ అని సీఎల్ఈవో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యోక ఆర్దితి రోచా తెలిపింది.
‘మెల్టింగ్ ఫ్లోరిడా’ క్యాంపెయిన్ పేరుతో ఇది వరకు కూడా సీఎల్ఈవో ఇలాంటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేపట్టింది. టాంపాలో ‘ఫ్లోరిడా ఫాంథర్స్’ పేరుతో రెండు మైనపు చిరుతలను ప్రయోగానికి ఉంచింది. దాని ద్వారా ‘ఎక్కువ ఉష్ణోగ్రతలు.. లెస్ వైల్డ్ లైఫ్’ అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నించింది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల బీచ్‌లు కూడా తగ్గిపోతాయని తెలిపేలా.. మియామీ బీచ్‌లో ‘వ్యాక్స్ లైఫ్‌గార్డ్ బీచ్’ను ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ‘మోర్ హీట్.. లెస్ బీచెస్’ అనే మెసేజ్ అందించారు.