వాటర్ ట్యాక్సీలు @ముంబై

by Sujitha Rachapalli |
Water Taxis
X

దిశ, ఫీచర్స్ : సముద్రయానం చేసే పర్యాటకులు, బిజినెస్‌మెన్ కోసం కేరళ రాష్ట్రం మొట్టమొదటిసారిగా ‘వాటర్ ట్యాక్సీ’లను ప్రారంభించగా, ఇప్పుడు ముంబైలోనూ వీటిని స్టార్ట్ చేయబోతున్నారు. ఇందుకోసం ముంబై పోర్ట్ ట్రస్ట్ (MbPT) పలు సంస్థలతో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ మేరకు ముంబై సిటీ డొమెస్టిక్ క్రూయిజ్ టర్మినల్ ‘ప్రిన్సెస్ డాక్’ నుంచి ‘మన్వ, జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్, బేలపూర్, వాషి’ వరకు వాటర్ ట్యాక్సీలను నడపాలని నిర్ణయించింది.

కాగా రోడ్డు మార్గం ద్వారా అయితే సౌత్ ముంబై నుంచి నవీ ముంబైకి గంటన్నరకు పైగా సమయం పడుతుండగా, వాటర్ ట్యాక్సీలో అయితే 40 నిమిషాల్లోనే డెస్టినేషన్‌కు చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ ట్యాక్సీలో 50 మందికి మాత్రమే సీటింగ్ కెపాసిటీ ఉండగా, వంద వరకు పెంచుతామని పోర్టు అధికారులు తెలిపారు. ముంబైలోని ప్రాంతాలకు మాత్రమే కాకుండా గుజరాత్, కాశీ తదితర ప్రదేశాలకు కూడా వాటర్ ట్యాక్సీలను నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. వాటర్ ట్రాన్స్‌పోర్ట్‌తో పాటు టూరిజాన్ని ఎంకరేజ్ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.7,510 కోట్లు కేటాయించగా.. ఇందులో భాగంగానే అధికారులు వాటర్ ట్యాక్సీలను రూపొందిస్తున్నారు. కాగా, మరికొన్ని నెలల్లో ముంబైవాసులకు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed