భీమా ఫేజ్-2 నుంచి నీటి విడుదల

by Shyam |   ( Updated:2020-07-14 11:31:10.0  )
భీమా ఫేజ్-2 నుంచి నీటి విడుదల
X

దిశ, మహబూబ్‌నగర్: జిల్లాలోని భీమా ఫేజ్2 నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నీరంజన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. మంగళవారం రాత్రి ఆయన దేవరకద్ర ఎమ్మెల్యే అలావెంకటేశ్వర్ రెడ్డితో కలిసి తిరుమలాయపల్లి వద్ద పూజలు చేసి, ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం జరిగింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ… ఈ ప్రాజెక్టు కింద వనపర్తి, దేవరకద్ర, కొల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన 48 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. ఆర్ & ఆర్ సమస్యలున్నా రైతులకు లబ్దిచేకూరాలని 2015 నుంచి సాగు నీరు విడుదల చేస్తున్నామని చెప్పారు. భీమా ఫేజ్ 1, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ లిఫ్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, జూరాల నుండి గేట్లు ఎత్తి కృష్ణా నదిలోకి నీళ్లు వదిలిన మరుక్షణం కల్వకుర్తి ఎత్తిపోతల పంపులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్టు తెలిపారు. ఏ సమయంలోనైనా కల్వకుర్తి పంపులు ప్రారంభిస్తామని, రైతులు సంతోషంగా ఉన్నారని, పుష్కలంగా నీళ్లు అందిస్తామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed