ఆ జిల్లాలో దంచికొట్టిన వర్షం..

by srinivas |
ఆ జిల్లాలో దంచికొట్టిన వర్షం..
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలోని ప్రకాశం జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. దాంతో రావిపాడులోని గుండ్లకమ్మ వాగులో వరద ఉధృతి పెరగడంతో అటు వైపుగా వచ్చిన ట్రాక్టర్ కొట్టుకుపోయింది. ఆ సమయంలో అందులో ఏడుగురు ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, చీరాల, కనిగిరి, అద్దంకి, గిద్దలూరులో కురిసిన భారీ వర్షానికి రోడ్లు వాగులను తలపించాయి. గిద్దలూరువద్ద తగిలేరు వాగుకు వరద ఉధృతి పెరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రకాశం జిల్లాలోని రాచర్లలో అత్యధికంగా 20 సెం.మీ., గిద్దలూరులో 15.3 సెం.మీ., అద్దంకిలో 15 సెం.మీ. వర్షపాతం నమోదయింది. రాచర్ల మండలం, గుడిమెట్టలో గ్రామ చెరువు పొంగిపొర్లుతోంది. వరద నీరు గ్రామంలోకి వస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తగిలేరువాగు ఉధృతికి బ్రిడ్జిపైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నాగులుప్పాడు మండలం, మద్దిరాల, ఉంకోలు, దుద్దుకూరు, గంగారంలో వాగులు పొంగిపొర్లుతుండటంతో జనజీవనం స్తంభించిపోయింది.

Advertisement

Next Story