ఈ ఐపీఎల్ చాలా ప్రత్యేకం : సెహ్వాగ్

దిశ, స్పోర్ట్స్: యూఏఈలో జరుగుతున్న ఈ ఐపీఎల్ (Indian Premier League) చాలా ప్రత్యేకమని టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. ఏడాది కాలంగా దూరంగా ఉంటూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్ ధోని మైదానంలోకి అడుగుపెట్టడమే ఈ సీజన్‌ను ప్రత్యేకత చేకూర్చిందని ఆయన అభిప్రాయపడ్డాడు.

‘ఈ ఐపీఎల్ (IPL) సీజన్‌ ప్రతీ ఒక్కరికి ఎక్స్‌ట్రా స్పెషల్‌గా నిలుస్తుందనుకుంటున్నా. ప్రేక్షకులతో పాటు ఆటగాళ్లు ధోని మళ్లీ మైదానంలోకి దిగడాన్ని సంతోషాంగా ఆస్వాదిస్తారు.’అని తాను కో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘పవర్ ప్లే విత్ చాంపియన్స్’ (Power Play with Champions)షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రతీ భారతీయుడిలో క్రికెట్ నాటుకొని పోయిందని, ఎంతో మంది క్రికెట్ పునఃప్రారంభం కోసం వేచి చూస్తున్నారని సెహ్వాగ్ అన్నాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో నేను కూడా పాత మ్యాచ్‌లు చూశాను. నా సొంత ఇన్నింగ్స్‌లు కూడా చూసి విశ్లేషించుకున్నాను అని సెహ్వాగ్ అన్నాడు.

Advertisement