కొత్త కారుతో సుందర్ ఫోజులు

by Shiva |
కొత్త కారుతో సుందర్ ఫోజులు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ కొత్త కారుతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన అరంగేట్రం క్రికెటర్లకు ప్రముఖ్య పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ‘థార్’ కార్లను బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే నటరాజన్ తన కారును అందుకోగా.. తాజాగా కొత్త కారును అందుకున్నాడు.

ప్రస్తుతం ఐపీఎల్ కోసం రాయల్ చాలెంజర్స్ జట్టుతో ఉన్న వాషింగ్టన్ సుందర్ బయోబబుల్‌లోకి వెళ్ల ముందే ఈ బహుమతి అందుకున్నాడు. దానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నాడు. ‘ఈ అద్భుతమైన బహుమతి నాలో ఎంతో ఆనందాన్ని నింపింది. యువకులకు ప్రోత్సాహం అందించేందుకు ఆనంద్ మహీంద్ర ఇచ్చిన ఈ బహుమతి ఎంతో విలువైనదిగా భావిస్తున్నాను. ఇది ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తుంది. మీకు నా ధన్యవాదాలు’ అని సుందర్ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.

Advertisement

Next Story