'క్రికెట్‌లో ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిందే'

by Shyam |
క్రికెట్‌లో ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిందే
X

దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. క్రికెట్‌లో బంతికి ఉమ్మిని రుద్దడంపై కీలక చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. క్రికెట్ మ్యాచ్‌ల్లో క్రీడాకారులు బంతిని సెలైవాతో రుద్దడాన్ని నిషేధించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిపాదించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాడు. క్రికెట్‌లో ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఉన్న సాంప్రదాయాన్ని మార్చాల్సిన అవసరం లేదని అంటున్నాడు. కేవలం సెలైవాతో బంతిని రుద్దడాన్ని నిషేధించడం వల్ల ఆటగాళ్లకు కరోనా వ్యాపించదు అనుకోవడం పొరపాటే అన్నాడు. ‘ఈ విధానాన్ని పూర్తిగా తీసేసి.. కొత్త విధానాన్ని ప్రవేశపెడతారని తాను అనుకోవట్లేదని’ వార్నర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

ఆటగాళ్లను కరోనా నుంచి రక్షించేందుకు లాలాజలంతో బంతిని రుద్దడాన్ని నిషేధించి.. అంపైర్ల సమక్షంలో మరో పద్ధతిలో బంతిని షైన్ చేసే అవకాశాన్ని ఇవ్వాలని ఐసీసీ భావిస్తోంది. ఈ ప్రతిపాదనపై దిగ్గజ బౌలర్లు వకార్ యూనిస్, ఆశిష్ నెహ్రా, హర్బజన్ సింగ్ తదితరులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఐసీసీ బాల్ ట్యాంపరింగ్‌ను లీగలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నదనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. మరి ఆఖరుకు ఐసీపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Tags : Cricket, Saliva, Ball, Shining, Umpires, Tampering, Umpires, David Warner

Advertisement

Next Story

Most Viewed