నిషేధిత గుట్కా తరలిస్తున్న ముఠా అరెస్ట్

by Sumithra |
నిషేధిత గుట్కా తరలిస్తున్న ముఠా అరెస్ట్
X

దిశ, వరంగల్:
కర్నాటక నుంచి నిషేధిత పొగాకు‌ ఉత్పత్తులను తరలిస్తున్న ముఠాను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసారు.ఈ ఘటన గురువారం జిల్లాలోని పెద్ద పెండ్యాల సమీపంలో చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం..హన్మకొండ వికాస్ నగర్‌కు చెందిన తౌషి రమేశ్, కొల్ల నరసింహులు, ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలానికి చెందిన అనుముల సురేశ్, కొప్పుల అనిల్ అంబర్, గుట్కా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ రోజు బీదర్ నుంచి రెండు కార్లలో పొగాకు ఉత్పత్తులు తరలిస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్స్ నంది రామ్, మధు ధర్మసాగర్ పోలీసులు సంయుక్తంగా పెద్ద పెండ్యాల గ్రామ శివారులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న రెండు వాహనాలను నిలిపి సోదా చేయగా 23 పెద్ద సంచుల్లో అంబార్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వాహనంలోని నలుగురు వ్యక్తులను విచారించగా కర్నాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి వీటిని తరలిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి, 23 అంబార్ బ్యాగులు, రెండు కార్లు, 5 సెల్ ఫోన్లు, రూ.36,510 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story