- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భూ సర్వేకు మేం ఆదేశించలేదు.. ఎవరు, ఎందుకు చేస్తున్నారో తెలియదు
దిశ ప్రతినిధి, వరంగల్: ల్యాండ్ పూలింగ్‌కు భూ సర్వే చేపట్టాలని తాము ఎవరినీ ఆదేశించలేదని వరంగల్ కలెక్టర్ హరిత, హన్మకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆరేపల్లి, పైడిపల్లి రైతులకు స్పష్టం చేశారు. తమ భూముల్లో ల్యాండ్ సర్వే ఆపివేయాలని కోరుతూ సోమవారం ఇద్దరి కలెక్టర్లకు రైతులు గ్రీవెన్స్‌డేలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్లు మాట్లాడుతూ.. భూ సర్వే చేపట్టాలని తాము ఎవరికీ ఆదేశాలివ్వలేదని స్పష్టం చేశారు. ఎవరు చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో? విచారణ చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. వ్యవసాయ భూములపై పూర్తి అధికారం రైతులకే ఉంటుందని, అలా ఎవరైనా అబద్ధాలతో సర్వే చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు సైతం ఎవరికి పడితే వారికి భూ పత్రాలను ఇవ్వకూడదని కలెక్టర్లు సూచించారు.
ల్యాండ్ బ్యాంకు కోసమంటూ పంటపొలాలను పూలింగ్ చేసే ప్రక్రియకు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మార్గదర్శకంలో ఓ ప్రైవేటు ఏజెన్సీ వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలో ఉన్న ఆరెపల్లి, పైడిపల్లి, ఏనుమాముల, కొత్తపేట, మొగిలిచర్ల గ్రామాల్లో భూ సర్వే కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా అధికారులు మాత్రం ల్యాండ్ బ్యాంకు కోసమంటూ ప్ర్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. ఇది వివాదాస్పదం అవుతోంది. ఈ నేపథ్యంలో వరంగల్ కలెక్టర్ హరిత, హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీకి సోమవారం గ్రీవెన్స్ డేలో భాగంగా రైతులంతా విడివిడిగా వినతిపత్రాలు అందజేయడం గమనార్హం.
ఈ కార్యక్రమంలో ఆరేపల్లి, పైడిపల్లి రైతు ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ బుద్దె పెద్దన్న, కో కన్వీనర్లు కాంటివాడ బాపురావు, కుమారస్వామి కోతిమిరు, బోయిని ఐలయ్య, బుద్దె ఈశ్వర్, సభ్యులు బుద్దె చంద్రశేఖర్, లక్కర్సు శ్రీనివాస్, సింహగర్జన్, కోరే మహేందర్, బుద్దె సురేందర్, గట్టు రవి, ఎగ్గాడి జగన్, బుద్దె వీరేందర్, వనపర్తి శంకరయ్య, నర్సింగుల సూరి, అంతం రమేష్, బరుపటి భారత్, కమలాపురం జితేందర్, ఎల్లంశెట్టి వంశీ, సుంచు ప్రహలాద్, కొమ్ము అశోక్, మోర్తాల రమేష్, కాంటివాడ రాజేశ్వరరావు, కౌడగని సురేష్, కాంటివాడ రవి, బుద్దె శ్రీనివాస్, ప్రశాంత్, గాదె రాము, పాల్గొన్నారు.