నజీర్ సర్.. సోనమ్ కపూర్‌ను ఇలానే అనేవారా? : కంగనా

by Shyam |
నజీర్ సర్.. సోనమ్ కపూర్‌ను ఇలానే అనేవారా? : కంగనా
X

సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై రోజుకో చర్చ జరుగుతూనే ఉంది. కంగనా రనౌత్ లాంటి సినీ సెలెబ్రిటీలు మూవీ మాఫియా, ఇన్‌సైడర్ – ఔట్‌సైడర్ విషయాలను తెరపైకి తీసుకొచ్చి కరణ్ జోహార్, మహేష్ భట్ లాంటి ప్రముఖులను టార్గెట్ చేశారు.

అయితే, ఇదంతా అనవసరమైన టాపిక్ అని కొట్టిపారేశాడు బాలీవుడ్ ప్రముఖ నటుడు నసీరుద్దిన్ షా. బాలీవుడ్‌లో మూవీ మాఫియా అనేదే లేదని.. ఇదంతా కొందరు ఇమాజిన్ చేసుకుంటున్నారని చెప్పాడు. ప్రతీ ఒక్క ఫిల్మ్ మేకర్ కూడా తనకు నచ్చిన వాళ్లను, తనతో కంఫర్ట్‌గా పనిచేసే ఆర్టిస్టులను ఎంచుకుంటారని.. అయితే వారు ఫేమస్ పర్సన్స్ గానీ, వారి పిల్లలు గానీ అయ్యుండొచ్చని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. 40-45 ఏళ్ల కెరియర్‌లో తనకు చాలా స్లోగా ఫేమ్ లభించిందని.. అయితే ఏదో ఒక అడ్డంకి ఎదురవడం వల్లే ఇలా జరిగిందని మాత్రం అనుకోవడం లేదన్నారు నసీరుద్దిన్ షా. ఇన్‌సైడర్ – ఔట్‌సైడర్ అని ఏమీ లేదని, ఇదంతా రబ్బిష్ అన్న నసీరుద్దిన్ షా.. ఒక ప్రొఫెషన్ తండ్రికి నచ్చితే అదే బాటలో నడవాలని కొడుక్కు చెప్పడంలో తప్పేముందన్నారు. డాక్టర్ తన కొడుకును డాక్టర్ కావాలని ప్రోత్సహించినట్లే.. యాక్టర్ తన కొడుకును యాక్టర్ కావాలని ఎంకరేజ్ చేస్తారన్నారు.

సుశాంత్ సింగ్ తనకు పర్సనల్‌గా తెలియదని.. కానీ తనకు బ్రైట్ ఫ్యూచర్ ఉండేదని చెప్పాడు నసీరుద్దిన్ షా. కానీ నెపోటిజం వల్లే ఇదంతా జరిగిందని కొందరు వాదించడం మూర్ఖత్వం అన్నారు. కొందరు కావాలనే ఈ కేసును తమపై వేసుకుని సుశాంత్‌కు న్యాయం చేస్తామని లేనిపోని రాద్దాంతం చేస్తున్నారన్నారు. సగం చదువుకున్న వారి అభిప్రాయాలు ఇక్కడ ఎవరికీ అవసరం లేదని పరోక్షంగా కంగనా రనౌత్‌ను విమర్శించారు. ఇండస్ట్రీ గురించి కొందరికి మైండ్‌లో కొంత అసహనం ఉంటుందని.. దాన్ని మీడియా ముందు కక్కేస్తారని.. తద్వారా ఫేమస్ అయ్యేందుకు ప్రయత్నిస్తారని అన్నాడు. సుశాంత్ విషయంలో తప్పకుండా న్యాయం జరగాలి.. కానీ ఇందుకోసం చట్టం, న్యాయ వ్యవస్థ ఉందన్నారు.

దీనిపై స్పందించిన కంగనా.. నసీరుద్దీన్‌‌కు ఘాటు రిప్లై ఇచ్చింది. ‘నా అవార్డులు, విజయాలు చూసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు. అయినా నాకు ఇదంతా అలవాటైపోయింది.. కానీ ఒకవేళ నా ప్లేస్‌లో ప్రకాష్ పదుకునే లేక అనిల్ కపూర్ కూతురు ఉంటే ఇలాగే మాట్లాడేవారా? అని ప్రశ్నించింది.

Advertisement

Next Story