దేవరగట్టులో యుద్ద వాతావరణం

by srinivas |
దేవరగట్టులో యుద్ద వాతావరణం
X

దిశ, వెబ్‎డెస్క్ : కర్నూలు జిల్లా దేవరగట్టులో యుద్ద వాతావరణం నెలకొంది. కరోనా వ్యాప్తి కారణంగా కర్రల సమరాన్ని అధికారులు రద్దు చేసినప్పటికీ.. బన్నీ ఉత్సవాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మాలమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి జైత్రయాత్రలో కర్రలు, అగ్గిదివిటీలతో కొట్టుకున్నారు. కర్రల సమరంలో 40 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆలూరు, ఆదోని ఆస్పత్రులకు తరలించారు.

కరోనా కట్టడిలో భాగంగా దేవరగట్టు బన్నీ ఉత్సవాలను అధికారులు రద్దు చేశారు. అయినప్పటికీ అక్కడ నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దేవరగట్టులో భక్తుల రాక దృష్ట్యా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story