సినిమాలకు సమంత గుడ్ బై.. అక్కడే ఉంటానంటూ క్లారిటీ..?

by Anukaran |   ( Updated:2021-10-06 03:24:48.0  )
సినిమాలకు సమంత గుడ్ బై.. అక్కడే ఉంటానంటూ క్లారిటీ..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది సమంత. అక్కినేని ఇంటి కోడలిగా ఒక స్టార్ స్టేటస్ ని అనుభవించిన అమ్మడు చైతుతో విడాకుల తర్వాత ఆమె పరిస్థితి ఏంటి..? అనేదానిమీద ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సామ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొత్త సినిమాలు అంగీకరించకుండా ఉన్న సినిమాలను పూర్తిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఇకపోతే ఇండస్ట్రీలో వస్తున్న సమాచారాన్ని బట్టి సామ్ సినిమాలకు దూరం కానుందట. అందుకే అమ్మడు తెలుగులో ఎటువంటి సినిమాలను అంగీకరించలేదని టాక్ నడుస్తోంది. ఈ విడాకులు, మానసిక ఒత్తిడి కారణంగానే సామ్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం సామ్ ముంబైకి మకాం మార్చే అవకాశాలు ఉన్నాయని ఇంతకుముందు నుంచే వార్తలు గుప్పుమన్న విషయం తెల్సిందే. ఇక ఈ విషయమై సామ్ క్లారిటీ కూడా ఇచ్చేసింది. తానెక్కడికి వెళ్ళేది లేదని, హైదరాబాద్ తనకు సొంత ఇల్లు అని తెలిపింది. మరి సామ్ హైదరాబాద్ లో ఉంటే ఎక్కడ ఉంటుంది..? అనేది ఇప్పుడు ప్రశ్న. ఒకప్పుడు ఎంతో ఇష్టంగా ఈ జంట కట్టుకున్న అపార్టుమెంట్ లోనే సామ్ ఉండబోతుందని తెలుస్తోంది.

గచ్చిబౌలిలోని విలాసవంతమైన ఇంటిలో సామ్ -చైతు కాపురం పెట్టిన సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత చైతూ ఒక హోటల్ లో ఉంటుండగా, సామ్ మాత్రం ఆ ఇంటిలోనే ఉంటుంది. ఇకముందు కూడా సామ్ అదే ఇంటిలో ఉండనున్నదట. తన అభిరుచికి తగ్గట్టు ఆ ఇంటిని మార్చుకోనున్నదట. ఇప్పటికే టెర్రస్ మీద వెజిటబుల్ గార్డెన్ ను కూడా ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ ఇంట్లోనే ఉండి అమ్మడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఏం చేస్తుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed