- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పెషల్ ఆర్‌ఐలుగా మార్చండి.. హరీశ్‌కు వీఆర్వోల రిక్వెస్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వీఆర్వోల వ్యవస్థను రద్దు చేశారని, ఆ పోస్టుల స్థానంలో తమను స్పెషల్ ఆర్ఐలుగా, జూనియర్ అసిస్టెంట్లుగా మార్చాలని ఆర్ధిక మంత్రి హరీష్ రావును మంగళవారం రెవెన్యూ అధికారుల సంఘం కోరింది. ఈ మేరకు జాబ్ చార్ట్ ఏర్పాటు చేయాలన్నారు. మంత్రి హరీష్ రావు, బేవరేజ్ మాజీ చైర్మన్ దేవిప్రసాదరావును క్యాంప్ ఆఫీసుల్లో కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీష్ మీడియాకు వివరించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అధికారులు అమలు చేయడం లేదని, రెవెన్యూ శాఖలో పదోన్నతుల్లో ఆలస్యం చేస్తున్నారన్నారు. అంతా తానేనంటూ ఓ ఉన్నతాధికారి మోయలేని బరువును భుజాన వేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పని చేస్తున్న 5,485 మంది గ్రామ రెవెన్యూ అధికారుల సమస్యలను వివరించినట్లు పేర్కొన్నారు. మంత్రి హరీష్‌ను కలిసిన వారిలో ప్రధానకార్యదర్శి పల్లెపాటి నరేష్, సహా అధ్యక్షులు కాందారి భిక్షపతి, ఉపాధ్యక్షులు మౌలానా ఆశన్న, రామేశ్వర్ రావు, రమేష్, ప్రచార కార్యదర్శి రాజన్నలు ఉన్నారు.