రికార్డులు అప్పగించిన వీఆర్వోలు..!

దిశ, నారాయణఖేడ్: వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయడంతో వీఆర్వోలు రికార్డులను అప్పగించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని పలువురు వీఆర్వోలు తమ గ్రామాలకు చెందిన రికార్డులను ఆయా కార్యాలయాల్లో అప్పగించారు. నారాయణఖేడ్, కంగ్టి, మనూర్, నాగలిగిద్ద, కల్హేర్, సిర్గాపూర్ మండలాలకు చెందిన 49 మంది వీఆర్వోలు రికార్డులను తహశీల్దార్‎లకు అందజేసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు అశోక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.

Advertisement