వీఆర్వోను బలి తీసుకున్న కరోనా మహమ్మారి

by Sridhar Babu |
వీఆర్వోను బలి తీసుకున్న కరోనా మహమ్మారి
X

దిశ, సిరిసిల్ల : కరోనా బారిన పడి ఓ వీఆర్ఓ మృతి చెందారు. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన గట్టు స్వామి (42) తంగళ్ళపల్లి మండలంలో వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు కరోనా సోకడంతో పది రోజులుగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. జిల్లా కేంద్రంలో వీఆర్ఏగా పని చేసిన స్వామి వీఆర్ఓగా పదోన్నతి పొందారు. జిల్లా ఏర్పాటయ్యాక వీఆర్ఓ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన మృతి పట్ల జిల్లా రెవెన్యూ అధికారులు, వీఆర్ఓలు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story