హామీలను నెరవేర్చండి.. సీఎస్‌కు వీఆర్ఏల వినతి

by Shyam |
హామీలను నెరవేర్చండి.. సీఎస్‌కు వీఆర్ఏల వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతనెల 9న సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అసోసియేషన్ మంగళవారం వినతి పత్రం సమర్పించింది. అసెంబ్లీలో వీఆర్ఏలకు పే స్కేలు ప్రకటించారు. రెండు, మూడు నెలల్లోనే హామీని అమలు చేస్తామని ప్రగతిభవన్‌లో వీఆర్ఏలతో జరిగిన సమావేశంలోనూ చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి సాధించలేదు. కేవలం వీఆర్ఏల డేటా మాత్రమే సేకరించారని వినతి పత్రంలో పేర్కొన్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏలు 8ఏండ్లు పూర్తి చేసుకున్న వారికి వీఆర్వోలుగా పదోన్నతులు వచ్చే సమయానికి వ్యవస్థ రద్దయ్యిందన్నారు. వీఆర్వో, జూనియర్ అసిస్టెంట్ స్కేలు ఒకటే కావడం వల్ల తమను జూనియర్ అసిస్టెంట్ స్కేలుకు మార్చాలని కోరారు. జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించిన ఫైలు ప్రభుత్వం దగ్గర పెండింగులో ఉంది. ఆ ఫైలును అప్రూవ్ చేసి అర్హత ఉన్న వీఆర్ఏలకు జూనియర్ అసిస్టెంట్ స్కేలు వర్తింపజేయాలని ప్రార్ధిస్తున్నట్లు సంఘం గౌరవాధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్ సీఎస్‌కు వినతి పత్రం సమర్పించారు.

Advertisement

Next Story

Most Viewed