కౌశిక్ రెడ్డితో ఓటర్ల వాగ్వాదం.. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత (వీడియో)

by Anukaran |   ( Updated:2021-10-29 23:29:48.0  )
కౌశిక్ రెడ్డితో ఓటర్ల వాగ్వాదం.. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత (వీడియో)
X

దిశ, వీణవంక : హుజురాబాద్‌లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో వీణవంక మండలం ఘన్ముక్లలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థి కాకపోయినప్పటికీ టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. అది గమనించిన ఓటర్లు కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు.

పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రచారం ఎందుకు చేస్తున్నావ్ అంటూ కౌశిక్‌ను నిలదీశారు. దీంతో ఆ పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి బయటకు పంపించారు.

కమలాపూర్‌లో ఓటేసిన ఈటల.. సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు


Advertisement
Next Story

Most Viewed